Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి

కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated : 16 Mar 2024 10:13 IST

ఒట్టవా: కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన కుటుంబం (Indian-Origin Family) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగడంతో వారు చనిపోయారు. గతవారమే (మార్చి 7) ఈ ఘటన జరిగింది. ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను గుర్తించినట్లు నిన్న పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల ద్వారా మృతులను గుర్తించారు. రాజీవ్ వరికూ(51), ఆయన భార్య శిల్పా కొత్త(47), వారి కుమార్తె మహెక్‌గా నిర్ధరించారు. మొదట ప్రమాదవశాత్తూ ఇంట్లో మంటల చెలరేగాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని