Canada: శాశ్వత నివాస హోదా వచ్చిన కొద్దిరోజులకే.. కెనడాలో భారతీయుడి హత్య

కెనడా(Canada)లో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. రెండుదేశాల మధ్య దౌత్యపరమైన ఒడుదొడుకులు కొనసాగుతోన్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

Updated : 10 Jun 2024 11:35 IST

సర్రే: కెనడా(Canada)లో నివసిస్తున్న ఇండియన్‌ యువరాజ్‌ గోయల్‌ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 7న ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

యువరాజ్‌ది పంజాబ్‌లోని లుథియానా. ఉన్నతచదువులు నిమిత్తం 2019లో ఆయన కెనడా వెళ్లారు. ప్రస్తుతం సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని యువరాజ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని