Israel-Hamas: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం.. భారత్‌ సంతతి సైనికుడి మృతి

ఇజ్రాయెల-హమాస్‌ యుద్ధంలో భారత్‌ సంతతికి చెందిన డేనియల్స్‌ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Published : 07 Dec 2023 21:51 IST

జెరూసలెం: హమాస్‌ నరమేధానికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు (Israel-Hamas war) కొనసాగుతున్నాయి. గాజా (Gaza) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హమాస్‌ ఉగ్రమూలాలను కూకటివేళ్లతో పెకలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో జరిపిన ఎదురు కాల్పుల్లో భారత్‌ సంతతికి చెందిన గిల్‌ డేనియల్స్‌ అనే సైనికుడు మంగళవారం ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ఇజ్రాయెల్‌ వెల్లడించింది. బుధవారం ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొంది. ఆయన పూర్వీకులు భారత్‌లోని మహారాష్ట్రకు చెందిన వారని ఇండియన్ యూదు హెరిటేజ్ సెంటర్ తెలిపింది. గత నెలలోనే నిశ్చితార్థం జరిగిందని, అంతలోనే ప్రాణాలు కోల్పోయాడని అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయం నుంచి  ఫార్మసీలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన డేనియల్స్‌.. సైనిక వృత్తి పట్ల ఆసక్తితో సైన్యంలో చేరాడని చెబుతున్నారు. హమాస్‌ పై భూతల పోరాటం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 86 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఇంతకుముందు అక్టోబర్‌ 7న జరిగిన దాడుల్లో భారత్‌ సంతతికి చెందిన మరో సైనికుడు మరణించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు