California: మేయర్‌కు ఉగ్ర బెదిరింపులు.. అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు

భారత సంతతికి చెందిన ఓ మహిళను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన నగర సమావేశంలో పాల్గొన్న ఆమె.. మేయర్‌పై ఉగ్ర బెదిరింపులకు పాల్పడడమే అందుకు కారణం. 

Updated : 13 Apr 2024 17:51 IST

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన ఓ మహిళ అమెరికా (USA)లోని కాలిఫోర్నియాలోని (California) బేకర్స్‌ఫీల్డ్‌ మేయర్‌పై ఉగ్ర బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన సిటీ కౌన్సిల్‌ సమావేశంలో చోటుచేసుకొంది. మేయర్‌ ఆదేశాల మేరకు తక్షణమే ఆమెను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

బేకర్స్‌ఫీల్డ్‌లో జరిగిన సమావేశంలో రిద్ధి పటేల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మైనారిటీ అణచివేత, ఇజ్రాయెల్‌- హమాస్‌ అంశాలను ప్రస్తావించిన ఆమె మేయర్‌ కరెన్ గోహ్‌పై విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ వ్యవహారంలో కాల్పుల విరమణ తీర్మానానికి మద్దతు ఇవ్వనందుకు వారిపై మండిపడ్డారు. అణచివేతకు గురైన మైనారిటీలు హింసాత్మక విప్లవం ద్వారా ఏదో ఒకరోజు మిమ్మల్ని అంతం చేస్తారని నగర అధికారులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘హిందూవుల చైత్ర నవరాత్రులు మొదలయ్యాయి. దీన్ని ఆచరించే మేము, గ్లోబల్‌ సౌత్‌లోని ఇతర ప్రజలు తమ అణచివేతదారులపై హింసాత్మక విప్లవాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు ఎవరైనా గిలెటిన్‌తో మీ అందర్నీ చంపేస్తారని ఆశిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

అమెరికాలో భార్యను చంపి పరారీ.. భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు

ప్రభుత్వ కార్యాలయం వద్ద మెటల్‌ డిటెక్టర్లు, అదనపు భద్రతను ఏర్పాటుచేయడం నిరసనకారులను నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నమే అంటూ తప్పుబట్టారు. మిమ్మల్ని హత్య చేసేందుకు మీ ఇంట్లో కలుద్దాం అంటూ ప్రసంగాన్ని ముగించారు. ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మేయర్‌ ఫైర్‌ అయ్యారు. తక్షణమే పటేల్‌ను అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని