Indian student: విమానంలో ప్రయాణికులపై ఫోర్క్‌తో దాడి చేసిన భారతీయ విద్యార్థి!

Eenadu icon
By International News Team Updated : 28 Oct 2025 12:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: విమానంలో ప్రయాణిస్తుండగా.. భారత్‌కు చెందిన ఓ విద్యార్థి తోటి ప్రయాణికులపై ఫోర్క్‌తో దాడికి పాల్పడ్డాడు. విమానయాన సిబ్బందిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయగా అధికారులు ఆ భారతీయుడిని అదుపులోకి తీసుకున్నారు.   

భారత్‌కు చెందిన ప్రణీత్‌ కుమార్‌ ఉసిరిపల్లి (28) ఇటీవల లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ (Lufthansa Airlines)కు చెందిన విమానంలో షికాగో నుంచి జర్మనీ (Chicago to Germany)కి వెళ్లే విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో 17 ఏళ్ల వయసున్న ఇద్దరిపై ఫోర్క్‌తో దాడి చేశాడు. దీంతో ఒకరికి భుజంపై, మరొకరికి తల వెనక భాగంపైనా తీవ్ర గాయాలయ్యాయి. ఉసిరిపల్లి (Praneeth Kumar Usiripalli)ని అడ్డుకునేందుకు విమానయాన సిబ్బంది ప్రయత్నించగా.. చేతి వేళ్లను గన్‌లా చూపిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే అతడు విమానంలో మరో మహిళ పైనా చేయి చేసుకొన్నాడు. సిబ్బందిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో విమానాన్ని బోస్టన్‌ లోగాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అక్కడ ఉసిరిపల్లిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను యూఎస్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. విద్యార్థి వీసాపై ఉసిరిపల్లి అమెరికా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మాస్టర్స్‌ చదివేందుకు వచ్చిన అతను ప్రస్తుతం అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేరం రుజువైతే ఉసిరిపల్లికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్లకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. 

Tags :
Published : 28 Oct 2025 12:27 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు