israel: సిరియాలోని ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. పలువురు మృతి

సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేపట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. 

Updated : 02 Apr 2024 05:58 IST

డమాస్కస్‌: సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్‌ (Iran) రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై ఇజ్రాయెల్‌ (Israel) వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన సీనియర్‌ సైనిక సలహాదారుతో పాటు ఇతర సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని సిరియా అధికారులు, అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. దాడి ఘటనలో కుప్పకూలిన కాన్సులర్‌ భవనం పక్కనే రాయబార కార్యాలయం ఉంది. ఈ దాడిలో చనిపోయిన ఇరాన్‌ మిలిటరీ సలహాదారు జనరల్‌ అలీ రెజా జెహ్‌దీ 2016 వరకు లెబనాన్‌, సిరియా దేశాల్లో ఖుద్స్‌ బలగాలకు నేతృత్వం వహించారు. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.   

దాడి ఘటనపై ఇజ్రాయెల్‌ స్పందించలేదు. ఈ ఘటనను ఇరాన్‌ రాయబారి హొస్సేన్‌ అక్బరీ ఖండించారు. ఏడుగురు చనిపోయినట్లు ఆయన తెలిపారు. భవనానికి కాపాలాగా ఉన్న ఇద్దరు పోలీసులు సైతం గాయపడినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని, ఇంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను ప్రపంచమంతా ఖండించాలని ఇరాన్‌ విదేశాంగ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని