Israel: బందీలను విడిచే వరకు గాజాకు ఇంధనం సరఫరా చేయం: నెతన్యాహు

హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల్ని విడిచిపెట్టేవరకు కాల్పులు విరమించబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. గాజాకు ఇంధనం సరఫరానూ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 

Published : 08 Nov 2023 02:00 IST

టెల్‌ అవీవ్‌: కాల్పులు విరమించాలని ప్రపంచదేశాలు కోరుతున్నా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas conflict) పరస్పరం దాడులకు దిగుతూనే ఉన్నాయి. హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం మొదలై నెల రోజులయిన సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) మీడియాతో మాట్లాడారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల్ని విడిచిపెట్టేవరకు కాల్పులు విరమించబోమని మరోసారి స్పష్టం చేశారు. హమాస్‌ మిలిటెంట్లకు కేంద్రంగా మారిన గాజాకు ఇంధనం సరఫరా కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 

హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌ను స్థావరంగా చేసుకొని ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోన్న హెజ్‌బొల్లా గ్రూప్‌ను నెతన్యాహు హెచ్చరించారు. లెబనాన్‌ నుంచి యుద్ధంలో భాగమవ్వాలని చూస్తే హెజ్‌బొల్లా పెద్ద పొరపాటు చేస్తున్నట్లేనని చెప్పారు. దీనికి తీవ్ర పరిణామాలుంటాయన్నారు. అక్టోబర్‌ 7న జరిగిన దాడుల్లో 1400 మంది తమ ప్రజలు మృతి చెందారని, 240కి మందికిపైగా పౌరుల్ని హమాస్‌ అపహరించి బందీలుగా చేసుకుందని ఇజ్రాయెల్‌ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 11 వేల మందికి పైగా మృతి చెందినట్లు హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని