Israel Strikes: సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. 42 మంది మృతి

సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్‌ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు.

Published : 29 Mar 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌తో యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియా (Syria)పై ఇజ్రాయెల్‌ (Israel) విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas War) మొదలు ఆ దేశ సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారి.

అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్‌బొల్లాకు చెందిన రాకెట్‌ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని బ్రిటన్‌ ఆధారిత ‘సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’ తెలిపింది. ఇరాన్ అనుకూల గ్రూపులకు చెందిన రక్షణ కర్మాగారాలను కూడా టార్గెట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనను సిరియా సైన్యం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌తోపాటు స్థానిక తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని పేర్కొంది. ఈ క్రమంలోనే సైనికులతోపాటు సాధారణ పౌరులూ మృతి చెందినట్లు ఆరోపించింది.

లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక

తాజా దాడులపై ఇజ్రాయెల్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అంతకు కొన్ని గంటల ముందే సిరియా రాజధాని డమస్కస్‌ శివార్లలోనూ ఓ నివాస భవనం లక్ష్యంగా చేపట్టిన దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది. హెజ్‌బొల్లా సహా ఇరాన్‌ మద్దతుగల సాయుధ బృందాలకు కీలక స్థావరమైన సయిదా జైనాబ్‌ ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్లు అబ్జర్వేటరీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని