Japan: మాస్కుల దెబ్బకు.. నవ్వడమే మరచిపోయారట..!
కొవిడ్ (Covid 19) ఆంక్షలతో సుదీర్ఘ కాలంపాటు మాస్కులు ధరించిన జపాన్ వాసులు.. నవ్వడమే (Smile) మరచిపోయారట. ఇటీవల ఆంక్షలు ఎత్తివేయడంతో నవ్వడంపై శిక్షణా తరగతులకు హాజరు అవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి (Covid Pandemic) సృష్టించిన విలయం నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇదే సమయంలో కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు అమలు చేసిన ఆంక్షలు.. అక్కడి ప్రజలపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సుదీర్ఘకాలం పాటు మాస్కులు (Mask) ధరించడంతో కొంతమంది జపాన్ వాసులు (Japan) నవ్వడమే మరచిపోయారట. దీంతో ఇటీవల మాస్కులపై ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ నవ్వడాన్ని (Smile) నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులకు హాజరవుతుండటం విశేషం.
కొవిడ్-19 కట్టడిలో భాగంగా జపాన్ కఠిన ఆంక్షలు (Covid Restrictions) విధించింది. మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. మూడేళ్ల తర్వాత ఇటీవలే ఆ ఆంక్షలు ఎత్తివేసింది. మాస్కులు ధరించడం ఇక నుంచి ప్రజల వ్యక్తిగత ఇష్టమని ప్రకటించింది. ఇక్కడివరకు ఎలాగున్నా.. ఆంక్షలు సడలించిన తర్వాత చాలామంది జపాన్‌వాసులు నవ్వడంపై సెమినార్లు, వర్క్‌షాపులకు పరుగెడుతున్నారట. చేతిలో అద్దం పట్టుకొని తమ ముఖాలను చూసుకొని నవ్వుతున్నారట. టోక్యోలో ఇటువంటి వర్క్‌షాపులకు ఇటీవల తాకిడి పెరిగిందని ఎగావోయుకు అనే హాస్య శిక్షణా సంస్థ వెల్లడించింది. ఆంక్షల కాలంలో సన్నిహితులతో కలవడం కుదరకపోవడంతోపాటు తమ నవ్వును ఇతరులతో పంచుకునే అవకాశం కోల్పోయామని సెమినార్‌కు వచ్చినవారు వాపోతున్నారని తెలిపింది. మాస్కులు తీసేయాల్సి వచ్చినప్పుడు కాస్త భయం, బిడియంగా అనిపిస్తోందని ఈ సెమినార్‌లో పాల్గొన్నవారు చెప్పడం గమనార్హం.
సుదీర్ఘకాలం పాటు మాస్కులు ధరించడం వల్ల వారి స్నేహితుల ముఖం ఎలా ఉంటుందోనన్న విషయం కూడా కొందరు మరచిపోయారని టోక్యోలోని స్కూల్ ఆఫ్ స్మైల్ నిర్వాహకురాలు కైకో కవానో పేర్కొన్నారు. కొవిడ్ మొదలైన కొంతకాలం తర్వాత.. నవ్వడం తగ్గిపోయిందన్న భావన ప్రజల్లో మొదలైందన్నారు. ఈ అసంతృప్తి చాలా మందిలో ఉందని చెప్పారు. అందుకే ప్రజలు మరోసారి తమ నవ్వును ఆస్వాదించాలని కోరుకుంటున్నారని.. దీంతో వరుస సెమినార్లతో ఇటీవల తాము ఎంతో బిజీగా మారామని స్మైల్ కోచింగ్ నిర్వాహకులు వెల్లడించారు.
అయితే, కొవిడ్‌కు ముందు కూడా నవ్వడం నవ్వడంపై శిక్షణా కార్యక్రమాలు చేపట్టేవారమని టోక్యోలోని ఎగావోయుకు సంస్ధ వెల్లడించింది. కానీ, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య కాలంలో మాత్రం ఈ సెమినార్‌కు వచ్చేవారి సంఖ్య 4.5రెట్లు పెరిగిందని తెలిపింది. హాస్యంపై పలు కార్యక్రమాలు నిర్వహించే మరో సంస్థ కూడా ఇప్పటివరకు 4వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే, కరోనా అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి కాదని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
World News
2000 Notes: గల్ఫ్‌లోని భారతీయులకు రూ.2000 నోట్ల కష్టాలు
-
General News
CM Kcr: కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.. రెండ్రోజుల్లో విధివిధానాలు: సీఎం కేసీఆర్
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు