Moon Sniper: జాబిల్లి ఉపరితలంపై జపాన్‌ ల్యాండర్‌.. ఫలితంపై ఉత్కంఠ!

గతేడాది సెప్టెంబరులో జపాన్‌ ప్రయోగించిన తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ (SLIM) చంద్రుడిపైకి చేరుకుంది. ప్రయోగం విజయవంతంపై ఉత్కంఠ నెలకొంది.

Published : 19 Jan 2024 21:59 IST

టోక్యో: జపాన్‌ (Japan) ప్రయోగించిన తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ చంద్రుడి (Moon)పైకి చేరుకుంది. గతేడాది సెప్టెంబరులో జపాన్‌ అంతరిక్ష సంస్థ (JAXA) ప్రయోగించిన ‘స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌ (SLIM)’ ల్యాండర్‌ నేడు జాబిల్లి ఉపరితలాన్ని తాకింది. అయితే.. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యిందా? లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ‘స్లిమ్‌’ ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేస్తున్నట్లు ‘జాక్సా’ వెల్లడించింది. ఒకవేళ ప్రయోగం విజయవంతమైతే..ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్‌ నిలుస్తుంది. ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాలే (అమెరికా, రష్యా, చైనా, భారత్‌) చందమామపై విజయవంతంగా అడుగుపెట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని