Japan: భవిష్యత్తులో జపాన్‌లో అందరికీ ఒకే ఇంటిపేరు..!
భవిష్యత్తులో జపాన్ జనాభా విచిత్రమైన సమస్యలో చిక్కుకోవచ్చు. అక్కడ అందరికీ ఒకే ఇంటిపేరు వచ్చే అవకాశం ఉంది.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం అమల్లో ఉన్న కఠినతర వివాహ చట్టాలు కొనసాగితే భవిష్యత్తులో జపాన్(Japan)లో అందరికీ ఒకే ఇంటిపేరు వస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. పెళ్లి చేసుకొన్న జంటలు వేర్వేరు ఇంటి పేర్లను ఉంచుకునే హక్కును ఇవ్వకపోతే.. 2531 నాటికి జపాన్ ప్రజల పేర్ల చివర ‘సాటో’ అనేది మిగులుతుందని ఆ నివేదికలో పేర్కొంది. జపాన్‌లో 18వ శతాబ్ధంలో చేసిన సివిల్ కోడ్ చట్టం ప్రకారం దంపతులు ఇద్దరూ ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలి.
తొహొకు విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ హిరోషి యషోహిడా నేతృత్వంలో ఈ అధ్యయనం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో 3,00,000 ఇంటి పేర్లు ఉన్నాయి. జనాభాలో అత్యధికంగా ‘సాటో’ అనేది 18,00,000 మంది పేర్ల పక్కన కనిపిస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో సుజుకీ, తకాహాషి అనే ఉన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో దంపతులు వేర్వేరు ఇంటిపేర్లను పెట్టుకొనే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్లు మొదలయ్యాయి. లేకపోతే ‘సాటో’ మాత్రమే మిగులుతుంది.
ప్రస్తుతం జపాన్‌లో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గింది. 2023లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వివాహాల్లో 6 శాతం తగ్గుదల కనిపించింది. దాదాపు 12 కోట్లకుపైగా జనాభా ఉన్న దేశంలో 5,00,000 కంటే తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. గత 90 ఏళ్లలో ఇదే అత్యల్పం. విడాకుల రేటు మాత్రం ఇదే సమయంలో 2.6 శాతం పెరిగింది. ఈ పరిస్థితి మారితేనే తన అంచనాలు నిజమవుతాయని.. లేకపోతే వాటిల్లో తేడా రావొచ్చని హిరోషి అభిప్రాయపడ్డారు.
1980ల్లో ఆర్థిక వృద్ధి మొదలైన తర్వాత నుంచి జపాన్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు అది కేవలం 1.3శాతం మాత్రమే ఉంది. ప్రస్తుత జనాభా సంఖ్యనే భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే ఇది కనీసం 2.1శాతం ఉండాలి. గత పదేళ్లుగా ఈ దేశంలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్‌తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్‌తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్‌వర్క్‌పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్‌లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్‌లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్‌లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్‌పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్‌ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్‌ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.