Malala Yousafzai: వెండి తెరపై తళుక్కుమన్న మలాలా యూసఫ్‌జాయ్

పిన్న వయసులో నోబెల్‌ బహుమతి పొందిన పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ వెండి తెరపై కనువిందు చేశారు.

Published : 02 Jun 2024 00:04 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లో బాలికల విద్య కోసం పోరాడుతున్న నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్(Malala Yousafzai)  వెండి తెరపై మెరిసింది. బ్రిటీష్ షో ‘వి ఆర్ లేడీ పార్ట్స్’ రెండో సీజన్‌లో అతిధి పాత్రతో తెరపై అలరించింది. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీవీ సిరీస్‌లో ఆమె మలాలా నటించిన టీవీ షో సీజన్ 2 గురువారం అమెరికాలోని ఎన్సీబీ యూనివర్సల్ స్ట్రీమర్, బ్రిటన్‌లోని ఛానల్ 4లో ప్రారంభమవ్వనుంది.

వీడియోలో బ్యాండ్‌లో పాట పాడే ఓ మహిళ కుమార్తె తన గురువుపై గుడ్లు విసురుతుంది. దీంతో ఎందుకలా చేశావని ఆమె తల్లి ప్రశ్నించగా మలాలా ఏమి చేస్తుందో అదే చేస్తున్నానంటూ ఆమె బదులిస్తుంది. మలాలా ప్రతిరోజూ బాలికల విద్య కోసం పోరాడుతుంది. ఇలా గుడ్లు విసరదని చెబుతున్న సమయంలో బ్యాండ్ 'మలాలా మేడ్ మీ డూ ఇట్' పాటను ప్రదర్శిస్తుంది. ఈ పాటలోని ఒక ఫాంటసీ సీక్వెన్స్‌లో మలాలా యూసఫ్‌జాయ్ కౌబాయ్ టోపీని ధరించి గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రిటన్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూలో సీక్వెన్స్ గురించి మలాలా మాట్లాడుతూ తాను తెరపై కనిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ‘‘ఈ రెండు నిమిషాల క్లిప్‌ కోసం ఎన్ని టేక్‌లు తీసుకున్నానో కూడా నాకు గుర్తు లేదు. ఇందులో నాకు డైలాగులు లేనందున ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు’’ అని ఆమె అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు