Mehul Choksi: భారత్‌కు రాకుండా.. ఆంటిగ్వా పోలీసులు, జడ్జీకి ఛోక్సీ లంచాలు..!
తన అప్పగింతను ఆలస్యం చేసేందుకు మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) ఆంటిగ్వాలో కుట్రలు పన్నుతున్నట్లు తాజాగా బయటపడింది. ఇందుకోసం ఆయన అక్కడి పోలీసులు, జడ్జీకి లంచాలు ఇచ్చినట్లు ఓ ఇన్వెస్టిగేటర్ సంచలన విషయాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) భారత్‌కు రాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంటిగ్వా (Antigua)లో ఉన్న ఛోక్సీ.. తన అప్పగింత కేసును ఆలస్యం చేసేందుకు ఆ దేశ పోలీసులకు లంచాలను ఇస్తున్నట్లు తాజాగా బయటపడింది. ఆర్థిక నేరాలను విశ్లేషించే ప్రముఖ ఇన్వెస్టిగేటర్ కెన్నెత్ రిజాక్.. ఛోక్సీ కుట్రల గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఛోక్సీని అప్పగించేందుకు ఆంటిగ్వాలో భారత్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై కోర్టు విచారణలను ఆలస్యం చేసేందుకు ఛోక్సీ కుట్రలు పన్నుతున్నారని రిజాక్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఆంటిగ్వా సీనియర్ పోలీసు అధికారి సహా కొంతమంది ప్రభుత్వ అధికారులకు ఆయన లంచాలు ఇస్తున్నట్లు తెలిపారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ హెన్రీని ఛోక్సీ తన రెస్టారెంట్‌లో పలుమార్లు రహస్యంగా కలిసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని పేర్కొన్నారు. పోలీసులతో పాటు ఆంటిగ్వా మెజిస్ట్రేట్ కాన్లిఫి క్లేర్క్‌కు కూడా ఛోక్సీ లంచాలు ఇచ్చినట్లు రిజాక్ వెల్లడించారు. వీరిద్దరూ కలిసి కేసు విచారణను ఆలస్యంగా చేస్తున్నారని తెలిపారు. అంతేగాక, ఛోక్సీ (Mehul Choksi)ని భారత్ అప్పగించేందుకు ఇంటర్‌పోల్ చేస్తున్న ప్రయత్నాల్లో హెన్రీ, క్లేర్క్ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
‘అదృశ్యం’ కూడా నాటకమే..
ఈ సందర్భంగా 2021 నాటి ఛోక్సీ ‘అదృశ్యం’ ఘటనకు సంబంధించి కూడా అనేక విషయాలను రిజాక్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. క్యూబాకు పారిపోయేందుకు ఛోక్సీ ప్రయత్నించాడని, అది విఫలమవడంతోనే ‘కిడ్నాప్’ నాటకం ఆడినట్లు తెలిపారు. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘భారత్, క్యూబా మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేదు. అందుకే 2021 మే నెలలో ఛోక్సీ (Mehul Choksi) ఆ దేశానికి పారిపోవాలనుకున్నాడు. ఇందుకోసం ఓ స్మగ్లర్ల బృందంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆ బృందం ఛోక్సీని డొమినికా తీరంలో దించేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత డొమినికా పోలీసులు పట్టుకోవడంతో కిడ్నాప్ నాటకం తెరపైకి తెచ్చాడు’’ అని రిజాక్ వివరించారు.
రూ. 13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం (PNB Scam) కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణం బయటకు రాకముందే ఆంటిగ్వా పారిపోయిన ఛోక్సీ.. అక్కడి పౌరసత్వాన్ని వినియోగించుకొని నివసిస్తున్నాడు. అయితే 2021 మే నెలలో ఆంటిగ్వా నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైన అతడు.. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఛోక్సీని బలవంతంగా కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఆ సమయంలో ఛోక్సీని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. కిడ్నాప్ కేసులో విచారణ జరిపిన డొమినికా.. అనారోగ్య కారణాల రీత్యా అతడికి బెయిల్ మంజూరు చేస్తూ తిరిగి ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతినిచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
కోహ్లీ అందరికన్నా ముందొచ్చి..
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి