Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల పునరుద్ధరణ
క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంలో ట్రంప్ సామాజిక మాధ్యమ ఖాతాలను నిషేధించిన విషయం తెలిసిందే. వాటిని తాజాగా ఒక్కొక్కటిగా ఆయా సంస్థలు పునరుద్ధరిస్తున్నాయి.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు మెటా (Meta) ప్లాట్‌ఫామ్స్ బుధవారం ప్రకటించింది. 2020 ఆఖర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Trump) ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై దాడికి దిగారు. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్ (Trump) చేసిన ప్రకటనలే ఈ దాడికి పురిగొల్పాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన నుంచి మరిన్ని సందేశాలు వెలువడితే పరిస్థితి మరింత దిగజారొచ్చన్న అనుమానంతో అప్పట్లో ట్రంప్ సామాజిక ఖాతాలను కంపెనీ నిషేధించింది. ఇటీవలే ట్విటర్ సైతం ఆయన ఖాతాను పునరుద్ధరించింది.
‘‘ఖాతాల నిషేధం అసాధారణ పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం. రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో ప్రజలకు తెలియాలి’’ అని మెటా అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగాధిపతి నిక్ క్లెగ్ అన్నారు. తద్వారా ఆ సమాచారం ఆధారంగా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో తానూ ఉంటానని ట్రంప్ (Trump) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
తమ కొత్త కంటెంట్ విధానం ప్రకారం.. ట్రంప్ చేసిన ఏదైనా సందేశం హానికారకమైనదని మెటా నిర్ణయించి.. అయినా, ప్రజలకు దాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉందని భావిస్తే దాన్ని ఆయన ఖాతాపై అలాగే కొనసాగిస్తామని క్లెగ్ తెలిపారు. కానీ, దాన్ని ఇతరులు షేర్ చేసేందుకు మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గళాన్ని వినిపించే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారు చెప్పే సమాచారంలో వాస్తవం లేకపోయినా మాట్లాడే అవకాశం ఉండాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, తప్పులు పునరావృతం కాకుండా స్పష్టమైన కట్టుదిట్టాలను ఏర్పాటు చేశామన్నారు.
ట్రంప్ ఖాతాను నిషేధించే నాటికి ఆయనకు ఫేస్‌బుక్‌లో 34 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్. ఇది ట్రంప్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాలకు కావాల్సిన నిధుల సేకరణలోనూ కీలక పాత్ర పోషించింది. తాజా మెటా నిర్ణయంపై ట్రంప్ స్పందించారు. ‘‘మీ ప్రియమైన అధ్యక్షుణ్ని నిషేధించడం ద్వారా బిలియన్ల డాలర్ల విలువను కోల్పోయిన ఫేస్‌బుక్ తాజాగా నా ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఒక సిట్టింగ్ అధ్యక్షుడిపై ఇలాంటి చర్యలకు మరోసారి దిగొద్దు. ఇంకెవరికీ ఇలా జరగొద్దు’’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ‘ట్రుత్ సోషల్’లో రాసుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్‌కు కాల్స్..!
-
India News
CUET-PG 2023: సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ ఇదే.. UGC ఛైర్మన్ ట్వీట్!
-
General News
Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
General News
KTR: పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలి: పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం