Israel: ‘ఇతర ప్రాంతాలపైనా దాడులకు సిద్ధం’.. ఇరాన్‌ బెదిరింపుల వేళ ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్‌ హెచ్చరించిన వేళ.. ఇతర ప్రాంతాలపైనా దాడులకు తాము సిద్ధమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. 

Published : 11 Apr 2024 21:31 IST

జెరూసలెం: సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ (Iran) రాయబార కార్యాలయంపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది ఇజ్రాయెల్‌ (Israel) పనేనని ఆరోపించిన ఇరాన్‌.. ఇందుకు ప్రతీకారంగా దాడులు తప్పవని హెచ్చరిస్తోంది. ఈక్రమంలో ఇతర ప్రాంతాల్లోనూ దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) పేర్కొన్నారు.

ఇరాన్‌ ఎంబసీపై జరిగిన దాడిలో కీలక సభ్యులు మృతి చెందారు. గాజాలో భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌.. ఇతర ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని చెబుతోంది. దాడుల నుంచి రక్షణ, దేశ భద్రతా అవసరాల దృష్ట్యా తాము అన్నివిధాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇలా చెప్పడం చూస్తుంటే మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది.

బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌

ఇరాన్‌ హెచ్చరికతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులపై జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్‌ ఇక్కడి విదేశాంగ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరినట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. మరోవైపు.. మధ్య ప్రాచ్యంలోని దేశాలు సంయమనం పాటించాలని రష్యా కూడా కోరింది. ఈ ప్రాంతాల్లో ఎవరూ ప్రయాణించకూడదని హెచ్చిరించింది. ఇదిలాఉండగా.. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఏప్రిల్‌ 13 వరకు టెహ్రాన్‌కు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని