Jaishankar: ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్‌

ఉగ్రవాదాన్ని దీర్ఘకాలంగా పెంచి పోషించిన ఓ దేశం.. చివరకు దానికే బలవుతోందని పాకిస్థాన్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు.

Published : 17 May 2024 16:39 IST

దిల్లీ: చట్టబద్ధ పాలనను విస్మరించడం, పరస్పరం కుదుర్చుకున్న ఒప్పందాలకు తూట్లు పొడవడం వంటి చర్యలతో ఆసియా భూభాగం, సముద్ర జలాల్లో సరికొత్త ఉద్రిక్తతలు తలెత్తాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) వెల్లడించారు. తూర్పు లద్ధాఖ్‌తోపాటు దక్షిణ చైనా సముద్రంలో చైనా (China) దుందుడుకు ధోరణి నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాదాన్ని దీర్ఘకాలంగా పెంచి పోషించిన ఓ దేశం.. చివరకు దానికే బలవుతోందని పాకిస్థాన్‌ (Pakistan)ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇరాన్‌తో డీల్‌.. భారత్‌కు అమెరికా వార్నింగ్‌..!

‘‘ప్రపంచం ప్రస్తుతం మూడు ‘ఎఫ్‌’ల సంక్షోభం ఎదుర్కొంటోంది. అవే ఫ్యూయెల్‌ (ఇంధనం), ఫుడ్‌ (ఆహారం), ఫెర్టిలైజర్స్‌ (ఎరువులు). అదేవిధంగా ఒప్పందాలను నిర్లక్ష్యం చేయడం, చట్టపాలనను విస్మరించడంతో ఆసియాలో కొత్త ఉద్రిక్తతలు ఉద్భవించాయి’’ అని జైశంకర్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ దౌత్యనీతిలో ధనబలం, ఆంక్షల బెదిరింపులు అస్త్రాలుగా మారాయని చెబుతూ.. చాబహార్‌ పోర్టు విషయంలో ఇరాన్‌తో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలను పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ప్రపంచాన్ని సాధ్యమైనంతవరకు స్థిరీకరించడంలో దోహదపడటమే భారత్‌ పని. ‘భారత్ ఫస్ట్’, ‘వసుధైవ కుటుంబం’ల కలయికే ‘విశ్వబంధు’గా దేశ గుర్తింపును నిర్వచిస్తుంది’’ అని జైశంకర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని