African:ఆఫ్రికాలో కొత్త వైరస్‌.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి

ఆఫ్రికాలో కొత్త వైరస్‌. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోపే ముగ్గురు మృత్యువాత పడ్డారు. 

Published : 31 Mar 2023 01:31 IST

బుజింబురా: ఆఫ్రికా(African)లోని బురుండిలోని ఒక చిన్నపట్టణంలో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.  ఇది స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.  ఈ వైరస్‌ సోకిన వారి ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి కొన్ని గంటల్లోనే మరణిస్తున్నారు.  బజిరో ప్రాంతంలో వైరస్‌ సోకి రక్తస్రావం జరిగిన 24 గంటల్లోపే ముగ్గురు మృత్యువాత పడ్డారు.  దీని బారిన పడిన వారిలో జ్వరం, తలనొప్పి, నీరసం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ లక్షణాలతో ఆస్పత్తుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పట్టణంలోని ప్రజలంతా క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.

ఈ వ్యాధి సోకిన రోగుల్లో కొందరు ఆసుపత్రికి చేరుకోవడానికి కొన్ని గంటల ముందే అధిక రక్తస్రావంతో  క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నట్టు రోగులను పరిక్షించిన ఓ ఆసుపత్రి తెలిపింది. బురుండియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health) వైరస్  బగ్‌గా కనిపిస్తోందని తెలిపింది. ఈ నెల ప్రారంభంలో పొరుగ దేశమైన టాంజానియా(Tanzania) మార్బర్గ్ వైరస్‌ వ్యాప్తిని ప్రకటించింది. దీంతో ఇతర దేశాలపైకూడా అధిక ప్రభావం చూపుతుందని.. అవి ప్రమాదానికి చేరువలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆఫ్రికాలో కొన్నేళ్ల క్రితం ఎబోలా వైరస్‌ మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా కొత్త వైరస్‌లు ప్రబలుతుండటంతో ఆఫ్రికాదేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు