Kim Jong un: ‘యుద్ధం వస్తే.. శత్రువులకు చావుదెబ్బ’ - కిమ్‌ పిలుపు

శత్రువులు ఎవరైనా రెచ్చగొడితే చావుదెబ్బ తీయాలని కిమ్‌ పిలుపునిచ్చారు.

Published : 11 Apr 2024 21:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశం చుట్టూ నెలకొన్న భౌగోళిక పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని మునుపెన్నడూ లేనివిధంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తన సేనలకు పిలుపునిచ్చాడు. అక్కడి (North Korea) మిలటరీ యూనివర్సిటీని సందర్శించిన ఆయన.. శత్రువులు ఎవరైనా రెచ్చగొడితే చావుదెబ్బ తీయాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రధాన శ్రతువుగా భావించే దక్షిణ కొరియాలో పార్లమెంటు ఎన్నికల ఫలితాల రోజే కిమ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘తమతో ఘర్షణకు దిగాలని శత్రువు భావిస్తే.. తమ వద్ద ఉన్న అన్ని మార్గాలను సమీకరించడం ద్వారా డీపీఆర్‌కే (డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా) వారిని నిస్సంకోచంగా చావుదెబ్బ తీస్తుంది’ అని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశిస్తూ కిమ్‌ పేర్కొన్నారు. కేవలం యుద్ధానికి సిద్ధంగా ఉండటమే కాకుండా.. తప్పకుండా విజయం సాధించాలని సైనికులకు పిలుపునిచ్చారు. ఇందుకు తమవద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామన్నారు.

రూ.లక్ష కోట్ల మోసం.. మహిళా టైకూన్‌కు మరణశిక్ష!

కిమ్‌ హయాంలో ఉత్తర కొరియా ఇటీవల భారీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. క్షిపణి ప్రయోగాలతో మునిగిపోతోంది. రష్యాతో సైనిక, రాజకీయ సంబంధాలను పెంచుకుంటోన్న కిమ్‌.. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో మాస్కోకు సాయం చేస్తోంది. దక్షిణ కొరియా(South Korea)ను ప్రధాన శత్రువుగా భావిస్తోన్న కిమ్‌.. అటువైపు నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటామనే ప్రకటనలు చేస్తున్నారు. దక్షిణ కొరియాలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని