Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో షాక్‌..! జైల్లో భేటీలపై నిషేధం

జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. తన కుటుంబ సభ్యులు, లాయర్లు, పార్టీ నేతలతో భేటీ అవకుండా స్థానిక ప్రభుత్వం నిషేధం విధించింది.

Published : 13 Mar 2024 00:51 IST

ఇస్లామాబాద్‌: ఆయా కేసుల్లో శిక్షలు అనుభవిస్తోన్న పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు మరో షాక్‌! ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అడియాలా జైలు (Adiala Jail)లో ఉన్నారు. ఈ క్రమంలోనే స్థానిక పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు, లాయర్లు, పార్టీ నేతలు.. ఇలా ఎవరితోనూ జైలులో భేటీ కాకుండా నిషేధం విధించింది. భద్రతా కారణాలను ఉటంకిస్తూ.. రెండు వారాలపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.

అడియాలా జైలుకు ప్రమాదం పొంచి ఉందని వివిధ నిఘా సంస్థల నుంచి సమాచారం అందినట్లు పంజాబ్ హోంశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘పాక్‌ విరోధుల మద్దతు ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలు.. లక్షిత దాడులకు ప్లాన్ చేశాయి. ఈ నేపథ్యంలో వెంటనే రెండు వారాలపాటు సమావేశాలు, బహిరంగ సందర్శనలు, ఇంటర్వ్యూలను నిలిపేయండి’’ అని కారాగార అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఉగ్రవాదుల రక్షణకు వీటోనా..?ఇవేం ద్వంద్వ ప్రమాణాలంటూ నిలదీసిన భారత్‌..!

ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (PTI)’ పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించింది. కేంద్రంలోని షెహబాజ్ షరీఫ్, పంజాబ్‌లోని మరియం నవాజ్‌ల ప్రభుత్వాలు.. తమ నేతను అణచివేసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించింది. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కొత్తగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ‘పీటీఐ’ శ్రేణులపై ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని