Pakistan: అవును.. ‘ఎక్స్‌’ను నిలిపివేశాం: పాక్‌

పాకిస్థాన్‌(Pakistan)లో ‘ఎక్స్‌’పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి పునరుద్ధరించాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది.

Published : 17 Apr 2024 21:33 IST

ఇస్లామాబాద్‌: భద్రతా కారణాల దృష్ట్యా సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌’ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజాగా పాకిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఫిబ్రవరిలో ఈ ఆంక్షలు మొదలయ్యాయి. ఆ విషయాన్ని ఇప్పుడు ధ్రువీకరించింది.  

ఎక్స్‌ ఖాతాల వినియోగంలో సమస్యలు ఎదురవుతున్నాయని యూజర్లు మొత్తుకున్నా ఇంతకాలం ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయితే బుధవారం పాకిస్థాన్ హైకోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ విషయాన్ని అంగీకరించింది. దాంతో కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఆ ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

పాకిస్థాన్‌లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా జరిగింది. ఇది పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే రిగ్గింగ్(poll rigging) జరిగిందని పోలింగ్‌ ఆఫీసర్ ఒకరు ఆరోపించారు. ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా కూడా చేశారు. దీనిపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అప్పటినుంచే ఎక్స్‌ వాడకంలో యూజర్లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని