Sharif: పొగడ్తలకు ఒలింపిక్స్ పెడితే షరీఫ్‌కు స్వర్ణ పతకం ఖాయం: పాక్ మాజీ దౌత్యవేత్త

ఇంటర్నెట్ డెస్క్: సమయం దొరికినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పొగడ్తలతో ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పాక్ మాజీ దౌత్యవేత్త హుస్సెన్ హక్కానీ (Husain Haqqani) స్పందిస్తూ.. షరీఫ్‌ను వెక్కిరించారు. ట్రంప్‌ను పొగిడేవారికి ఒలింపిక్స్ పోటీలు పెడితే పాక్ ప్రధానికి స్వర్ణ పతకం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. హక్కానీ గతంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేశారు.
ఇజ్రాయెల్- హమాస్‌ల యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులోని షర్మ్-ఎల్- షేక్‌లో శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మాట్లాడుతూ.. ట్రంప్ (Trump)ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్ అవిశ్రాంత ప్రయత్నాల వల్లే గాజాలో శాంతి నెలకొందన్నారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని.. అందుకుగాను ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హులని ఆకాశానికెత్తారు. భారత్- పాక్ మధ్య జరిగిన ఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్ ఇచ్చేశారు. ఇటీవల జరిగిన థాయ్‌లాండ్-కంబోడియాల కాల్పుల విరమణ ఒప్పందంలోనూ అమెరికా పాత్రను ప్రశంసించారు.
షరీఫ్ పదేపదే ట్రంప్‌ను పొగడడంపై స్వదేశంలోనే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. పాక్ ప్రధాని ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా మారి.. దేశాన్ని అమ్మేశారంటూ అక్కడి ప్రజలు షరీఫ్‌ను దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడిని షరీఫ్ అంతలా పొగడాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాక్‌కు చెందిన చరిత్రకారుడు అమర్ అలీ జాన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సమయం దొరికినప్పుడల్లా షరీఫ్ అనవసరంగా ట్రంప్‌ను ప్రశంసిస్తుండడం పాకిస్థానీయులకు ఇబ్బందికరంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

పాక్ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: బాంబు పేల్చిన ట్రంప్
Donald Trump: చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తోన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని ట్రంప్ అన్నారు. - 
                                    
                                        
చైనాతో మొన్న డీల్.. నేడు వార్నింగ్: ట్రంప్ హెచ్చరికలు దేనికంటే..?
Trump-Jinping: చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. - 
                                    
                                        

రూ.895 కోట్ల నగల చోరీ.. చిల్లర దొంగల పనే..!
Paris Museum Heist: మ్యూజియంలో భారీ చోరీకి పాల్పడింది చిల్లర దొంగలేనని తెలుస్తోంది. - 
                                    
                                        

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..6.3 తీవ్రతగా నమోదు
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. - 
                                    
                                        

సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
మెక్సికోలోని ఓ సూపర్మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. - 
                                    
                                        

‘డూమ్స్‌డే క్షిపణి’తో రష్యా సరికొత్త అణు జలాంతర్గామి!
అణుశక్తితో నడిచే పొసైడన్ అణు డ్రోన్‌తో కూడిన కొత్త అణు జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. ‘డూమ్స్‌డే క్షిపణి’గా కూడా ముద్రపడిన ఈ డ్రోన్.. సాగరంలో సుదూర ప్రాంతాలు చేరి, తీవ్ర వినాశనం సృష్టించగలదు. - 
                                    
                                        

రైలు బోగీ మొత్తం రక్తసిక్తం
బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌లో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. లండన్‌లోని డాన్‌కస్టర్ నుంచి కింగ్స్ క్రాస్‌కు వెళ్తున్న రైలులో దుండగులు కత్తులతో వీరంగం సృష్టించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 - 
                        
                            

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్‌లు.. వ్యాపారి గిఫ్ట్
 


