Pakistan: కమెడియన్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళా సింగర్‌!

పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన కమెడియన్‌.. ఓ మహిళా సింగర్‌ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు.

Published : 29 Feb 2024 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన ఓ కమెడియన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ మహిళా సింగర్‌ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. హనీమూన్‌కు  (Honeymoon) సంబంధించి గాయనిని సదరు కమెడియన్‌ ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలయ్యింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. కమెడియన్‌ చెంప చెళ్లుమనిపించింది. లైవ్‌ షోలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Michelle Obama: బైడెన్‌కు ప్రత్యామ్నాయం మిషెల్‌ ఒబామా!

‘పబ్లిక్‌ డిమాండ్‌’ పేరుతో ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్థాన్‌ ప్రముఖ గాయని షాజియా మంజూర్‌, కమెడియన్‌ శేరీ నన్హాలు పాల్గొన్నారు. ఈక్రమంలో కమెడియన్‌ నన్హా నవ్వుతూ.. ‘మన వివాహం జరిగిన తర్వాత.. హనీమూన్‌ కోసం మోంటె కార్లోకు తీసుకెళ్తాను. ఏ క్లాస్‌లో వెళ్దామో చెప్తావా’ అంటూ షాజియాను అడిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. అతడి చెంప చెళ్లుమనిపించింది. మహిళలతో ప్రవర్తించేది ఇలాగేనా అంటూ నిప్పులు చెరిగింది. గతంలోనూ అతడితో ఇటువంటి ఘటన ఎదురయ్యిందని వాపోయింది.

ఈ వివాదంలో జోక్యం చేసుకున్న నిర్వాహకులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మరోసారి ఈ షోకు రానంటూ షాజియా అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే దీన్ని చిత్రీకరించి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేస్తూ పలువురు యూజర్లు కామెంట్లు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు