Pakistan: పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌.. ఎన్నికైన రోజే భారత్‌పై అక్కసు

పాక్‌ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన షెహబాజ్‌ షరీఫ్‌.. కశ్మీర్‌ సమస్యను లేవనెత్తడమే కాకుండా దాన్ని పాలస్తీనాతో పోల్చాడు.

Published : 03 Mar 2024 23:15 IST

ఇస్లామాబాద్‌: ఏ ఒక్క దౌత్యపరమైన ఘర్షణల్లోనూ పాకిస్థాన్‌ (Pakistan) భాగం కాదని.. మిత్రదేశాల సంఖ్యను పెంచుకుంటామని నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. పొరుగు దేశాలతోపాటు అన్ని ప్రముఖ దేశాలతో సంబంధాలను పెంపొందించుకుంటామన్నారు. పాక్‌ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. కశ్మీర్‌ సమస్యను మరోసారి లేవనెత్తడమే కాకుండా దాన్ని పాలస్తీనాతో పోల్చడం గమనార్హం.

‘సమానత్వం ఆధారంగా పొరుగు దేశాలతో సంబంధాలను కొనసాగిస్తాం. అందరూ కలిసి రండి.. కశ్మీరీలు, పాలస్తీనీయుల స్వేచ్ఛ కోసం జాతీయ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించాలి’ అని షెహబాజ్‌ షరీఫ్‌ అని భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన సమయంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్న ఆయన.. తనపై విశ్వాసం ఉంచినందుకు సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్యపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోన్న సమయంలో తాను బాధ్యతలు చేపట్టానని అన్నారు. అయినప్పటికీ వీటి నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని