Iran Consulate: ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్‌ కాన్సులేట్‌ వద్ద కలకలం!

ఫ్రాన్స్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద కదలికలు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాయి.

Published : 19 Apr 2024 22:56 IST

పారిస్‌: ఫ్రాన్స్‌ (France) రాజధాని పారిస్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయం (Iran consulate) వద్ద శుక్రవారం కాసేపు ఉత్కంఠభరిత పరిస్థితులు కొనసాగాయి. పేలుడు పదార్థాలతో కూడిన జాకెట్‌ ధరించిన ఓ వ్యక్తి గ్రనేడ్‌ పట్టుకుని టెహ్రాన్‌ కాన్సులేట్‌ వద్ద తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, ప్రత్యేక ఏజెంట్లు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి.. దౌత్య కార్యాలయం పరిసరాలను జల్లెడ పట్టారు.

ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్‌!

ఒకవైపు ఇరాన్‌- ఇజ్రాయెల్‌ల మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పారిస్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో అంతా ఉరుకులు పరుగులు పెట్టారు. ఎట్టకేలకు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతడి వద్ద గానీ, వాహనంలో గానీ ఎలాంటి ఆయుధాలు లభించలేదని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. కాన్సులేట్‌ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని