Netherlands: పౌరులను బందీలుగా మార్చిన సాయుధుడు.. నెదర్లాండ్స్‌లో కలకలం

నెదర్లాండ్స్‌లోని ఓ పట్టణంలో ఒక సాయుధుడు పలువురు పౌరుల్ని బందీలుగా మార్చిన ఘటన ఆందోళన రేకెత్తిస్తోంది. 

Published : 30 Mar 2024 17:41 IST

అమెస్టర్‌డామ్‌: నెదర్లాండ్స్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇడె(Ede) పట్టణంలోని పలువురు పౌరులు బందీలుగా మారారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ వ్యక్తి వారిని ఒక క్లబ్‌లో బంధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కలకలం సృష్టిస్తోంది.

ఈ విషయం వెలుగులోకి రాగానే భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. రిమోట్‌ కంట్రోల్డ్‌ రోబో, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే బలగాలను మోహరించారు. దగ్గర్లో ఉన్న 150 ఇళ్లను ఖాళీ చేయించారు. ఎవరూ ఉద్రిక్త ప్రాంతం వైపు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఘటన వెనక ఉగ్రకోణం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆనవాలు లేవని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అమెస్టర్‌డామ్‌కు 85 కి.మీ.దూరంలో ఉన్న ఇడె పట్టణంలోని నైట్‌క్లబ్‌లో బందీలను ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని