Putin: ‘కీలక మలుపు వద్ద ప్రపంచం’: విక్టరీ డే సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు

విక్టరీ డే సందర్భంగా రష్యా భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహించింది. మాతృభూమికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించారని ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్(Putin) పశ్చిమ దేశాలపై విరుచుకుపడ్డారు. 

Updated : 09 May 2023 20:28 IST

మాస్కో: రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు యుద్ధాన్ని ప్రారంభించాయని రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Vladimir Putin) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రపంచం కీలక మలుపు వద్ద ఉందని అన్నారు. మంగళవారం విక్టరీ డే సందర్భంగా మాస్కోలోని రెడ్‌స్క్వేర్ వద్ద జరిగిన పరేడ్‌లో ఆయన పాల్గొని, మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ‘విక్టరీ డే’(Victory Day)(మే 9న)ని రష్యా ఘనంగా నిర్వహిస్తుంది. 

‘ప్రస్తుతం ఈ ప్రపంచం ఒక కీలక మలుపు వద్ద ఉంది. మన మాతృభూమికి వ్యతిరేకంగా ఒక అసలైన యుద్ధాన్ని ప్రారంభించారు’ అని పుతిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ‘మనం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తరిమికొట్టాం. డాన్‌బాస్ ప్రాంత ప్రజలకు రక్షణగా కల్పిస్తాం. అలాగే ఉక్రెయిన్‌లో సైనిక చర్యలో భాగమైనందుకు గర్వంగా ఉంది’ అని అన్నారు. అంతేగాకుండా హుర్రే అంటూ పరేడ్‌లో పాల్గొన్న సైనికులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా భారీ స్థాయి సైనిక కవాతు నిర్వహించారు.

గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ యుద్ధానికి ఏడాది దాటింది. దీంతో ఇరువైపులా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. అయినా దీనికి ముగింపు మాత్రం కనిపించడం లేదు. ఈ సమయంలోనే ఇటీవల రష్యా అధ్యక్షుడి నివాస, కార్యాలయ భవనాలున్న క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడియత్నం జరిగింది. వాటిని గుర్తించిన పుతిన్ సేన ముందుగానే ఆ డ్రోన్లను పేల్చివేసింది. ఇది ఇరువైపులా తీవ్ర వ్యాఖ్యలకు దారితీసింది. క్రెమ్లిన్ ఘటన వెనక అమెరికా హస్తం ఉందని రష్యా(Russia) ఆరోపించింది. మరోపక్క, ‘విక్టరీ డే ముందు ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఇందులో నలుగురు పౌరులు మృతి చెందారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని