Princess Diana: ప్రిన్సెస్‌ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!

ప్రిన్సెస్‌ డయానాకు సంబంధించిన ఉత్తరాలు వేలానికి సిద్ధమయ్యాయి. ఆమె తన వ్యక్తిగత సేవకుడికి రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నాయి.

Published : 02 Jun 2024 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందంతో పాటు తన సేవాగుణంతో అంతులేని ప్రజాభిమానం సంపాదించుకున్న బ్రిటన్‌ ప్రిన్సెస్ డయానా (Princess Diana)కు సంబంధించిన కొన్ని వస్తువులు వేలం వేయనున్నారు. తన వ్యక్తిగత సేవకుడికి రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అందులో పంచుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

తన జీవితంలో మధుర క్షణాలు, అనేక సంఘటనలకు సంబంధించిన అనుభవాలను తన మాజీ హౌస్‌ కీపర్‌ మౌడ్‌ పెండ్రీతో ప్రిన్సెస్‌ డయానా పంచుకున్నారు. జీవితంలోని మైలురాళ్లనూ ప్రస్తావించారు. ప్రిన్స్‌ చార్లెస్‌తో 1981లో డయానాకు వివాహం జరిగిన తర్వాత.. తన హనీమూన్‌ విషయాలను పేర్కొన్నారు. తన మొదటి సంతానమైన విలియం జన్మించినప్పుడు కలిగిన సంతోషాలను అందులో పంచుకున్నారు. ‘‘విలియం రాకతో నా జీవితంలో ఎంతో ఆనందాన్ని నింపాడు. తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నేనెంతో అదృష్టవంతురాలిని’’ అని ఒక లేఖలో రాసుంది.

డ్రాగన్‌ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్‌ అయిన చాంగే-6..!

నూతన సంవత్సరం, క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ఆమె ఇతరులకు రాసిన లేఖలు కూడా వేలానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న జులియన్‌ ఆక్షన్‌ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 27న వేలం నిర్వహించనున్నారు. వీటికి భారీ స్పందన రానుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రిన్సెస్‌ డయానా.. 1996లో చార్లెస్‌తో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాదిలో జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. 36 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు