Oscars: ఆస్కార్‌ వేడుకలకు ‘గాజా’ నిరసనల సెగ

Oscars: ఇజ్రాయెల్‌ హమాస్ మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు ఆస్కార్ వేడుక వేదిక వద్ద నిరసన తెలిపారు.

Published : 11 Mar 2024 08:49 IST

లాస్‌ ఏంజిల్స్‌: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల సెగ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ (Oscars) వేడుకలకూ తగిలింది. ఆందోళనకారులు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలువురు ప్రముఖులు కార్యక్రమానికి ఆలస్యంగా హాజరయ్యారు.

నిరసనలపై ముందే సమాచారం ఉన్న లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల చుట్టుపక్క ప్రాంతాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు మద్దతుగా నిలవాలని అక్కడికి వచ్చే ప్రముఖులను కోరారు. మరోవైపు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డు అందుకున్న బిల్లీ ఇలిష్‌, ఫినియాస్‌.. గాజాకు మద్దతిస్తూ ప్రత్యేక బ్యాడ్జీని ధరించడం గమనార్హం. మరికొందరు ప్రముఖులూ వీరి బాటలోనే పయనించారు.

అంతా ఊహించినట్లుగానే ఈసారి ఆస్కార్‌ అవార్డుల్లో ఓపెన్‌హైమర్‌ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, నటుడు, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్, ఎడిటింగ్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని