S-400: ఆ ‘ఎస్‌-400’లు.. వచ్చే ఏడాదే భారత్‌కు!

భారత్‌కు రష్యా అందజేయాల్సిన మిగతా రెండు ‘ఎస్‌-400’ అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదే చేరుకుంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

Published : 23 Apr 2024 21:51 IST

దిల్లీ: భారత్‌కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్‌-400 (S-400)’లను అందజేయడంలో రష్యా (Russia) మరింత జాప్యం చేస్తుందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. 2026 మూడో త్రైమాసికం నాటికి మిగతా రెండు వ్యవస్థలను అందజేస్తామని మాస్కో హామీ ఇచ్చినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. అయితే.. వచ్చే ఏడాదే ఇవి భారత్‌కు చేరుకుంటాయని అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. రష్యా నిర్మించిన రెండు యుద్ధనౌకల్లో మొదటిదైన ‘తుషీల్’ను కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో డెలివరీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. రెండో యుద్ధనౌక ‘తమల్‌’ వచ్చే జనవరిలో చేరుకుంటుందని పేర్కొన్నాయి.

జీపీఎస్‌ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?

ఐదు ‘ఎస్‌-400’ ట్రయంఫ్‌ రెజిమెంట్ల విషయంలో భారత్‌ 2018లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ 5.5 బిలియన్‌ డాలర్లు. వాస్తవానికి 2024 తొలి అర్ధభాగంలోనే మొత్తం అందజేయాల్సింది. కానీ, ఇప్పటివరకు మూడు మాత్రమే చేరుకున్నాయి. మరోవైపు.. రెండు యుద్ధనౌకలను 2022 నాటికే డెలివరీ చేయాల్సింది. అయితే.. ఉక్రెయిన్‌తో రష్యా సుదీర్ఘ యుద్ధం కారణంగా జాప్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. ‘ఎస్‌-400’ వ్యవస్థలు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలు, క్రూజ్‌ క్షిపణులను ధ్వంసం చేయగలవు. ప్రస్తుతం వాయుసేన ఆధ్వర్యంలో పాక్, చైనా సరిహద్దుల్లో 1.5 రెజిమెంట్ల చొప్పున మోహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని