Zelensky: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 50 మంది మృతి!

ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన రాకెట్‌ దాడిలో 50 మంది మృతి చెందారు. ఖర్కివ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 05 Oct 2023 20:23 IST

కీవ్‌: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం ఎంతకూ తెగడం లేదు! సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌ (Ukraine)పై పుతిన్‌ సేనలు దాడులు మొదలుపెట్టి ఇప్పటికే 19 నెలలు దాటింది. ఈ క్రమంలోనే మాస్కో మరోసారి విరుచుకుపడింది. ఖర్కివ్‌ (Kharkiv) ప్రాంతంలోని ఓ దుకాణం, కెఫెపై జరిపిన క్షిపణి దాడిలో 50 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇటీవలి నెలల్లో అత్యంత భీకర దాడి ఇదే. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘రష్యన్‌ క్షిపణి దాడి క్రూరమైన నేరం. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన ఉగ్రవాద దాడి’ అని రష్యాపై మండిపడ్డారు.

ఇరాన్‌ అక్రమ ఆయుధాలు ఉక్రెయిన్‌కు.. అమెరికా కీలక నిర్ణయం

ఖర్కివ్‌ రీజియన్‌ కుపియాన్స్క్‌ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతం రష్యా సరిహద్దులో ఉంది. గతేడాది ఇక్కడ కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మాస్కో దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మృతుల్లో ఆరేళ్ల బాలుడూ ఉన్నట్లు స్థానిక గవర్నర్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధిత బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. ఈయూ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని పాశ్చాత్య మిత్రదేశాలను అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు