Ukraine - Russia: రెండు రష్యన్‌ కమాండ్‌ విమానాలను కూల్చివేసిన ఉక్రెయిన్‌

రష్యాకు చెందిన రెండు కమాండ్‌ విమానాలను ఉక్రెయిన్‌ (Ukraine-Russia) కూల్చివేసింది. ఈమేరకు ఉక్రెయిన్‌ ఆర్మీ చీఫ్‌ వలెరీ జలుజ్ని తెలిపారు.

Updated : 16 Jan 2024 05:49 IST

కీవ్‌: రష్యాకు చెందిన రెండు కమాండ్‌ విమానాలను ఉక్రెయిన్‌ (Ukraine-Russia) కూల్చివేసింది. ఈమేరకు ఉక్రెయిన్‌ ఆర్మీ చీఫ్‌ వలెరీ జలుజ్ని తెలిపారు. ఉక్రెయిన్‌ కూల్చిన ఏ-50 రాడార్‌ డిటెక్షన్‌ విమానం, ఐఎల్‌-22 కంట్రోల్‌ సెంటర్ విమానం రష్యా వైమానిక దళంలో అత్యంత విలువైనవిగా భావిస్తారు. అజోవ్ సముద్రం మీదుగా వెళ్తున్న ఈ రెండు విమానాలను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. ‘‘ఇది రష్యాకు ఆర్థికంగా పెద్ద దెబ్బ. ఆ విమానాల ఖరీదు కొన్ని మిలియన్‌ డాలర్ల పైమాటే. పక్కా ప్రణాళికతో మా వైమానిక దళం ఈ ఆపరేషన్‌ పూర్తి చేసింది. వారికి కృతజ్ఞతలు’’ అని వలెరీ చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి సమచారం లేదని రష్యా అధికారులు పేర్కొన్నారు. కాగా A-50 ఎయిర్‌క్రాఫ్ట్ (command plane) గగనతలం నుంచి గగనతలం లేదా గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే 10 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నియంత్రించగలదు. ఎయిర్‌ డిఫెన్స్‌ గుర్తించడంలో, రష్యా జెట్‌లను సమన్వయం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఎయిర్‌క్రాప్ట్‌ కూలిన ఘటనలో వైమానిక సిబ్బంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌ దాడితో ఐఎల్‌-22 విమానం రష్యాలోని అనపాలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయింది. ఈ విమానానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని