Ukraine: ఉక్రెయిన్‌లోని పోస్టల్‌ డిపోపై రష్యా దాడి.. ఆరుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడికి పాల్పడింది. శనివారం రష్యా బలగాలు ప్రయోగించిన క్షిపణులు పోస్టల్‌ డిపోపై పడ్డాయి. దీంతో అందులో పనిచేస్తోన్న ఆరుగురు మృతి చెందారు. 

Updated : 22 Oct 2023 06:31 IST

ఖర్కీవ్‌: ఇజ్రాయెల్‌ - హమాస్‌ భీకర పోరు కంటే ముందు నుంచే రష్యా - ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా రష్యా సైన్యం మరోసారి ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడింది. క్షిపణిని ప్రయోగించడంతో ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో ఉన్న పోస్టల్‌ డిపో భవనం ధ్వంసమైంది. అందులో పనిచేస్తోన్న ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ఖర్కీవ్‌లోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో ఉన్న రష్యన్‌ బలగాలు ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్‌ డిపోపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని