Putin: బెలారస్‌కు అణ్వాయుధాలు తరలించాం.. మాకు ముప్పు ఎదురైతే ప్రయోగిస్తాం

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై ఏడాది దాటినప్పటికీ ఇప్పట్లో ముగిసే దాఖలాలు కనిపించడం లేదు. పుతిన్‌ సేనకు దీటుగా ఉక్రెయిన్‌ సైన్యం కూడా పోరాడుతోంది. 

Published : 17 Jun 2023 23:39 IST

పుతిన్‌ సంచలన ప్రకటన

మాస్కో: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై ఏడాది దాటినప్పటికీ ఇప్పట్లో ముగిసే దాఖలాలు కనిపించడం లేదు. పుతిన్‌ సేనకు దీటుగా ఉక్రెయిన్‌ సైన్యం కూడా పోరాడుతోంది. ఇటీవలే ఎదురుదాడిని తీవ్రం చేసిన ఉక్రెయిన్‌.. రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో మరో గ్రామం తిరిగి తమ చేతుల్లోకి వచ్చినట్లు తెలిపింది. అయితే తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. బెలారస్‌లో మొదటి బ్యాచ్‌ అణ్వాయుధాలను మోహరించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించడం ఈ నెల చివరి నాటికి పూర్తవుతుందని చెప్పారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా దేశ భూభాగానికి బెదిరింపులు వస్తే మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్‌ చెప్పారు. అయితే బెలారస్‌ రష్యాకు కీలకమైన మిత్రదేశం.  యుద్ధభూమిలో శత్రు దళాలను, వారి ఆయుధాలను నాశనం చేయడానికి వ్యూహాత్మక న్యూక్లియర్‌ ఆయుధాలు. ఉపయోగించనున్నారు. ఉక్రెయిన్‌లోని మొత్తం నగరాలను కూల్చివేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉందని రష్యా సైనిక వర్గాల సమాచారం. తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుదీ మిస్సైళ్లు, బాంబులు తరలించినట్లు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో ధ్రువీకరించారు. ఈ అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధిక శక్తిమంతమైనవని తెలిపారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని