Russia: యుద్ధ ట్యాంకులను దెబ్బతీస్తే బోనస్.. సైనికులకు రష్యా ఆఫర్

ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా దాడితో గత ఏడాది నుంచి ఆ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో భాగంగా పాశ్చాత్య ఆయుధాలను ధ్వంసం చేసిన వారికి రష్యా(Russia) బోనస్‌లు అందిస్తోందని తెలుస్తోంది. 

Published : 16 Jun 2023 18:49 IST

మాస్కో: గత ఏడాది ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌(Ukraine), రష్యా(Russia) మధ్య యుద్ధం నడుస్తోంది. రష్యా దాడిని ప్రతిఘటించేందుకు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు యుద్ధ సామాగ్రిని అందిస్తున్నాయి. అందులో భాగంగా జర్మనీ నుంచి లెపర్డ్‌ ట్యాంకులు, అమెరికా యుద్ధ ట్యాంకులు పంపిస్తున్నాయి. అయితే యుద్ధంలో వాటిని ధ్వంసం చేసిన సైనికులకు రష్యా ఆఫర్ ప్రకటించింది. ఆ బలగాలకు బోనస్ ఇస్తామని రక్షణ శాఖ వెల్లడించింది.

యుద్ధంలో రాణించిన సిబ్బంది కోసం రష్యా ఒక రివార్డు స్కీమ్‌ తీసుకువచ్చింది. దానికింద గత ఏడాది నుంచి 10వేల మందికి పైగా బోనస్‌లు అందుకున్నారు. అలాగే ఈ ట్యాంకులను ధ్వంసం చేసినందుకు ప్రస్తుతం సైనికులకు చెల్లింపులు జరుగుతున్నాయని రష్యాకు చెందిన సైనికాధికారులు కొందరు వెల్లడించారు. అంతేగాకుండా ఈ ట్యాంకులను ధ్వంసం చేసిన సైనికులకు రక్షణ శాఖ మంత్రి సెర్గీ షొయిగు(Sergei Shoigu) ఈ ఆదివారం ‘హీరో ఆఫ్ రష్యా గోల్డ్ స్టార్‌’ మెడల్‌ను అందించి సత్కరించారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌, పాశ్చాత్య దేశాలకు చెందిన 16,001 యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేశారు. 

పుతిన్‌ సిద్ధంగానే : క్రెమ్లిన్‌

ఉక్రెయిన్‌ సమస్యను పరిష్కరించేందుకు చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగానే ఉన్నారని క్రెమ్లిన్‌ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉన్న సంక్షోభ పరిస్థితులు సద్దుమణిగేలా చూసేందుకు కొత్త శాంతి ప్రతిపాదనను ఆఫ్రికన్ నేతలు పుతిన్‌కు అందించనున్నారు. ఈ క్రమంలోనే క్రెమ్లిన్‌ నుంచి ఈ స్పందన వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని