Germany: జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురి మృతి!

జర్మనీ(Germany)లోని ఓ ప్రార్థనామందిరంలో తుపాకీ పేలింది. దాంతో పోలీసులు అత్యంత ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

Updated : 10 Mar 2023 13:06 IST

హాంబర్గ్: జర్మనీ(Germany)లో కాల్పులు(Church Shooting) కలకలం సృష్టించాయి. హాంబర్గ్‌(Hamburg)లో జెహోవా విట్‌నెస్‌ సెంటర్‌(Jehovah's Witness centre)లో ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఇది జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన దుండగుడు కూడా మరణించినట్లు సమాచారం.  అయితే మృతుల సంఖ్యపై అధికారుల నుంచి స్పష్టమైన గణాంకాలు వెలువడలేదు.

హాంబర్గ్‌లోని విట్‌నెస్‌(Jehovah's Witness centre ) సెంటర్‌ వద్ద గురువారం రాత్రి దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొని ఉందని తెలియజేస్తూ పోలీసులు అలారం మోగించారు. అలాగే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.  ‘ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పుల వెనక దుండగుడి ఉద్దేశం తెలియరాలేదు’ అని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. 

వారంవారం నిర్వహించే బైబిల్ పఠనం కార్యక్రమంలో భాగంగా పలువురు విట్‌నెస్‌ సెంటర్‌ వద్దకు వెళ్లారు. అప్పుడే ఈ ఘటన జరిగింది. దీనికి పాల్పడింది ఒకరా లేక అంతకంటే ఎక్కువమందా? మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడా? అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని