Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచదేశాలను షాక్‌కు గురిచేసింది.  

Updated : 20 May 2024 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) దుర్మరణం చెందడంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ(Modi) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్‌-ఇరాన్‌ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్‌ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం’’ అని ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. 

  • ఈ మరణవార్త షాక్‌కు గురిచేసింది. ఇరాన్‌ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో పలుమార్లు సమావేశమయ్యాను. ఈ జనవరిలో మా మధ్య భేటీ జరిగింది. ఈ విషాద సమయంలో ఇరాన్‌ ప్రజలకు వెన్నంటి ఉంటాం: భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌
  • ఇరాన్‌కు కలిగిన తీరని నష్టంపై పాకిస్థాన్‌ తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని పార్థిస్తున్నాను. దాదాపు నెల రోజుల క్రితం రైసీ, విదేశాంగ మంత్రికి పాక్‌ ఆతిథ్యం ఇచ్చింది. వారు మా దేశానికి మంచి స్నేహితులు. ఆయన గౌరవార్థం ఒక రోజు సంతాపదినంగా పాటించనున్నాం: పాక్‌ ప్రధాని షహబాజ్ షరీఫ్
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని