క్షీణిస్తున్న సింగపూర్‌ జనాభా పెరుగుదల రేటు.. తొలిసారి 1 శాతం దిగువకు

సింగపూర్‌ జనాభా రేటు నానాటికీ క్షీణిస్తోందని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Published : 28 Feb 2024 19:18 IST

సింగపూర్‌: సింగపూర్‌ జనాభా పెరుగుదల రేటు నానాటికీ క్షీణిస్తోంది. దీంతో దేశంలో మానవ వనరుల కొరత ముప్పు ఎదుర్కొంటోంది. 2023లో సంతానోత్పత్తి రేటు (TER) ఒక శాతం దిగువకు పడిపోయిందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. జనాభా పెరుగుదల రేటు ఒక శాతం దిగువకు చేరడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది.

సింగపూర్‌లో సంతానోత్పత్తి రేటు 2021లో 1.12 నమోదవగా.. 2022లో 1.04కి పడిపోయింది. మునుపటి కంటే దిగజారి 2023లో 0.97 శాతం నమోదైంది. సింగపూర్‌లో 26,500 వివాహాలు జరగ్గా.. 30,500 శిశువులు జన్మించారు. ప్రతీ మహిళ 2.1 మందిని కంటేనే పాత తరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు. దీనికి సింగపూర్‌ చాలా దూరంలో నిలుస్తోంది. కొవిడ్‌ కాలంలో తలెత్తిన పరిస్థితులు సంతానోత్పత్తి రేటు తగ్గడంపై ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

ఇది దేశ భవిష్యత్తుపై తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చని ఆందోళన వ్యక్తంచేస్తోంది. తమ దేశ జనాభా రేటును పెంచేందుకు సింగపూర్‌ ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. తల్లిదండ్రులకు సెలవులతో పాటు, బేబీ బోనస్‌ ప్రయోజనాలను కల్పిస్తోంది. సింగపూర్‌ ఒక్కటే కాదు.. ఇటలీ, స్పెయిన్‌ వంటి యూరోపియన్‌ దేశాలూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు