స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..

స్లొవేకియా ప్రధాని రాబర్డ్‌ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.

Updated : 15 May 2024 19:57 IST

హాండ్లోవా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. హాండ్లోవాలో కేబినెట్‌ మీటింగ్‌లో పాల్గొని తిరిగివస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని