Asiana Airlines: గాల్లోనే తెరచుకున్న విమానం డోర్.. వణికిపోయిన ప్రయాణికులు!
విమానం గాల్లో ఉన్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ (Emergency Exit Door) తెరచుకోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన దక్షిణ కొరియాలో (South Korean flight) చోటుచేసుకుంది.
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఓ విమానానికి (South Korean flight) భారీ ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ వ్యక్తి అత్యవసర ద్వారాన్ని (Emergency Exit Door) తెరవడం తీవ్ర కలకలం రేపింది. క్యాబిన్‌లోకి భారీగా గాలులు వీయడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాలులతో కొందరికి శ్వాసకోశ సమస్యలు తలెత్తగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
దక్షిణ కొరియాలోని జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి ఏసియానా ఎయిర్‌లైన్స్ ఎయిర్ బస్ విమానం A321 బయలు దేరింది. విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు గంట. విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరచేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులు అతడిని అడ్డుకునేందుకు యత్నించారు. అప్పటికే ఆ అత్యవసర ద్వారం తెరచుకుంది. దీంతో భారీగా గాలిచొరబడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు.
ఈ ఘటనను అందులో ఉన్న కొందరు ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లోపలికి వీస్తున్న భారీ గాలితో ప్రయాణికులు ఆందోళన చెందుతున్న దృశ్యాలు కనిపించాయి. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డోర్ తీసినట్లు భావించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ చర్యకు పాల్పడటం వెనక అతడి ఉద్దేశం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఏసియానా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఈ పరిణామంతో విమాన ప్రయాణికులు భయాందోళనకు గురైనప్పటికీ.. ఎవరికీ గాయాలు కాలేదని ఏసియానాతోపాటు అక్కడి రవాణాశాఖ ప్రకటించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. పోలీసు కస్టడీకి విద్యుత్‌శాఖ డీఈ రమేశ్
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Crime News
Andhra News: పింఛను తీసుకునేందుకు వచ్చి.. ఒడిశా రైలు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగింది?
-
Politics News
Chandrababu: అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ
-
General News
Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించాలని కుట్ర జరుగుతోంది: చలసాని