Toothpicks: ‘టూత్‌పిక్స్ తినేస్తున్నారట..!’: దక్షిణకొరియాలో వింత ట్రెండ్‌

Toothpicks: అదేంటీ.. టూత్‌పిక్స్‌ తినేస్తున్నారా? అదెలా సాధ్యం? అనేగా మీ సందేహం. కానీ, ఇది నిజమేనట..! ఇంతకీ ఈ వైరల్‌ ట్రెండ్‌ ఏంటీ? దీంతో దక్షిణకొరియా ప్రభుత్వం ఎందుకు కలవరపడుతోంది? తెలుసుకుందాం పదండి..

Updated : 29 Jan 2024 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా కర్ర పుల్లలతో తయారుచేసిన టూత్‌పిక్స్‌ (Toothpicks)ను మనం విరివిగా వాడుతుంటాం. కానీ, దక్షిణ కొరియా (South Korea)లో మాత్రం చిలగడదుంప లేదా మొక్కజొన్న పిండితో తయారుచేసిన టూత్‌పిక్స్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటికి ఫుడ్‌ కలర్స్‌ జత చేయడంతో అనేక రంగుల్లో అందుబాటులో ఉంటాయి. పర్యావరణహిత చర్యల్లో భాగంగా కొన్నేళ్లుగా కొరియన్లు వీటినే ఉపయోగిస్తున్నారు.

అయితే, ఇటీవల అక్కడ టూత్‌పిక్స్‌తో ఓ వింత ట్రెండ్‌ మొదలైంది. కొంతమంది వీటిని వడియాల మాదిరిగా నూనెలో వేయించుకుని వాటిపై మసాలా చల్లి తింటున్నారు. ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. ఇవి సరదాగానే చేసినా దీనిపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. ‘‘ఇవి తినడానికి కాదు. వీటి నాణ్యత ప్రమాణాలను అధికారికంగా ధ్రువీకరించలేదు’’ అని తెలిపింది. వీటిని తినొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.

కాగా.. దక్షిణ కొరియాలో ఇలా వింత ట్రెండ్ వైరల్‌ అవడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ కొంతమంది సబ్బుముక్కలను తిని, ఉమ్మివేసే ఛాలెంజ్‌ను ట్రెండ్‌ చేశారు. అప్పుడు కూడా ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని