AI Tool: ఈ ఏఐ టూల్‌ సాయంతో మీ భవిష్యత్‌తో మీరు మాట్లాడొచ్చు!

AI Tool: మన భవిష్యత్‌తో మనం మాట్లాడుకునేలా కొత్త ఏఐ టూల్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు.

Published : 06 Jun 2024 00:05 IST

AI Tool | ఇంటర్నెట్ డెస్క్‌: భవిష్యత్‌లో ఫలానా లక్ష్యాన్ని చేరుకోవాలంటే పెద్దల సలహాలు అవసరం. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాల్లో పెద్దల అనుభవ పాఠాలను చెప్పేవారు. దాంతో మనల్ని మనం మలుచుకోవడంలో ఆ సలహాలు సూచనలు ఎంతగానో తోడ్పడేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి. సలహాలిచ్చేవారు దూరమయ్యారు. ఇప్పుడు ఆ చోటును ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భర్తీ చేయబోతోంది. ఇందుకోసం ఎవరి భవిష్యత్‌తో వారే మాట్లాడుకునేలా మసూచూ సెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు ఓ టూల్‌ను అభివృద్ధి చేశారు. దాంతో చర్చించి భవిష్యత్‌ నిర్ణయాలు తీసుకునేందుకు వీలు పడుతుంది.

ఈ చాట్‌బాట్‌ మీ భవిష్యత్‌ను మీ ముందుంచుతుంది. ఆనందమయమైన జీవితాన్ని సాకారం చేసుకోవడానికి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తుంది. ఇందుకోసం ముందుగా యూజర్లు తమ గురించిన సమాచారంతో పాటు తమ లక్ష్యాల గురించి చాట్‌బాట్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆపై తమ ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే..  భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నారనేది చిత్రంలో చూపిస్తుంది. ఆపై ఇచ్చిన ఇన్‌పుట్స్‌ ఆధారంగా సలహాలు, సూచనలు పొందొచ్చు. చాట్‌బాట్‌ అంచనాలు ఇక్కడ ముఖ్యం కానప్పటికీ.. వ్యక్తులు తమ భవిష్యత్‌ గురించి ఆలోచన చేయడం దీని ముఖ్య ఉద్దేశమని పరిశోధకులు పేర్కొన్నారు. దీర్ఘకాలానికి ఆలోచనలు చేయడం, అందుకు అనుగుణంగా తమ ప్రవర్తనలో మార్పు చేసుకోవడాననికి ఉపయోగడుతుందని పేర్కొన్నారు.

ఓపెన్‌ ఏఐ జీపీటీ 3.5 ఆధారంగా రూపొందించిన ఈ చాట్‌బాట్‌ యూజర్లు ఇచ్చిన ఇన్‌పుట్‌ ఆధారంగా సమాధానం ఇస్తుంది. అయితే, ఇచ్చిన సమాచారంలో ప్రామాణికత ఆధారంగా చాట్‌బాట్‌ సమాధానం ఉంటుందని ఎంఐటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే ఫలితాలు ఆశించిన మేర ఉండకపోవచ్చని తెలిపారు. మొత్తం 344 మంది వాలంటీర్లపై ప్రాథమికంగా నిర్వహించిన ప్రయోగాల్లో ఆశించిన మేర ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు