TikTok: టిక్‌టాక్‌తో జాతీయ భద్రతకు ముప్పు: తైవాన్‌

చైనా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ను తైవాన్‌ జాతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించింది.

Published : 24 Mar 2024 00:09 IST

తైవాన్:  చైనా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ తమ దేశ జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారిందని తైవాన్ డిజిటల్ వ్యవహారాల శాఖ మంత్రి ఆడ్రీ టాంగ్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విదేశీ శత్రువుల నియంత్రణలో పని చేసే సాంకేతిక ఉత్పత్తి ఏదైనా ప్రమాదకరమైనదేనని ఆమె పేర్కొన్నారు. ఇటీవల తైవాన్ పార్లమెంటు సమావేశాల్లో టిక్‌టాక్‌ను ప్రమాదకరమైన సామాజిక మాధ్యమంగా ప్రకటించామని ఆండ్రీ తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వ ఏజెన్సీలు, వాటి ప్రాంగణాల్లో టిక్‌టాక్ వినియోగాన్ని పరిమితం చేశామన్నారు. అయితే కేబినెట్ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నందున పాఠశాలలు, ప్రభుత్వేతర సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో వినియోగంపై ఈ నిషేధం విస్తరించే అవకాశం ఉందని ఆండ్రీ వివరించారు. 2022లో సవరించిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యకలాపాలు, సామాజిక స్థిరత్వానికి అంతరాయం కలిగించే అవకాశం ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ లేదా జాతీయ సమాచారం దేశ భద్రతకు ప్రమాదం కలిగించేదిగా టిక్‌టాక్‌ను పరిగణిస్తామని ఆమె పేర్కొన్నారు. 

టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌కు అమెరికాలోని యాప్‌ ఆస్తులను విక్రయించడానికి దాదాపు ఆరు నెలల సమయం ఇచ్చే బిల్లును మార్చి 13న అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని