Spain: ఆగిఉన్న రైలును ఢీ కొట్టిన మరో రైలు.. 150 మందికి గాయాలు

స్పెయిన్‌ రాజధాని బార్సిలోనా సమీపంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న ప్రయాణికుల రైలును వెనకనుంచి వచ్చిన మరో రైలు ఢీ కొట్టింది. ఈ ఘనటలో 150మందికిపైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

Published : 08 Dec 2022 01:46 IST

మాద్రీద్‌: స్పెయిన్‌లో భారీ ప్రమాదం తప్పింది. బార్సిలోనాకు సమీప స్టేషన్‌లో ఆగిఉన్న ఓ ప్రయాణికుల రైలును వెనకనుంచి వచ్చిన మరో రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 155 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా.. 39 మందిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాద సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.

ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన రవాణా శాఖ మంత్రి రాకెల్‌ సాంషెజ్‌.. ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాద తీవ్రత పక్కనబెడితే అదృష్టవశాత్తు ప్రాణనష్టం కలగకపోవడం ఉపశమనం కలిగించే విషయమన్నారు. అయినప్పటికీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రయాణికులకు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు