Trump: ‘గాజా దృశ్యాలను ప్రపంచం చూస్తోంది’: ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ట్రంప్‌

Israel–Hamas Conflict: ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్‌ దాడిని ఉద్దేశించి అధ్యక్షుడు బైడెన్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్‌ విమర్శలు చేశారు. 

Updated : 26 Mar 2024 13:54 IST

వాషింగ్టన్‌: తాను అధికారంలో ఉండి ఉంటే ఇజ్రాయెల్‌పై దాడి జరిగేది కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అన్నారు. అక్టోబర్‌ 7న  చోటుచేసుకొన్న ఆ మారణహోమంపై ప్రెసిడెంట్ జో బైడెన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. హమాస్‌ ఆయన్ను లెక్కచేయదని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేశారు. (Israel–Hamas Conflict)

‘ఆయన మాట్లాడలేరు. ఆయన విదేశాంగ విధానం భయానకం. బైడెన్‌(Biden)ను హమాస్ గౌరవించదు. అందువల్లే ఈ దాడి జరిగింది. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఇలాంటిది  జరిగేది కాదు. ఇజ్రాయెల్‌కు బైడెన్ శ్రేయోభిలాషి అయ్యుంటే.. పరిస్థితి ఇలా ఉండదు’ అని విమర్శలు చేశారు.

ట్రంప్‌నకు మళ్లీమళ్లీ రాని రోజు.. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!

అక్టోబర్‌ 7న జరిగిన మారణహోమం తర్వాత హమాస్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన ప్రతిదాడుల్ని సమర్థించిన ట్రంప్.. వాటిని ఇంకా కొనసాగించడం వల్ల అంతర్జాతీయ మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని నెతన్యాహు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గాజా నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు విషాదకరంగా ఉన్నాయన్నారు. వాటిని ప్రపంచం చూస్తోందన్నారు. అందుకే ఈ యుద్ధాన్ని ముగించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని