Trump: ‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్ పరోక్ష హెచ్చరిక!
Trump: శృంగార తార స్టార్మీ డానియల్స్‌కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అయితే, తనకు జైలు శిక్ష ఖరారు చేస్తే తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని పరోక్షంగా హెచ్చరించారు.
Trump | వాషింగ్టన్: తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని.. అలాగే తనని అభిమానించేవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని పరోక్షంగా సంకేతమిచ్చారు. తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శృంగార తార స్టార్మీ డానియల్స్‌కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో (Trump Hush Money Case) న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.
ఆవేదనలో మెలానియా..
ట్రంప్‌నకు జైలు శిక్ష పడొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దానిపై తొలిసారి స్పందించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తనపై నేరారోపణలు, న్యాయపరమైన చిక్కుల వల్ల సతీమణి మెలానియా ట్రంప్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. మొత్తం కుటుంబంపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపుతోందని వెల్లడించారు. తన కంటే తన కుటుంబమే ఎక్కువ క్షోభ అనుభవిస్తోందని చెప్పుకొచ్చారు.
స్టార్మీ డానియల్స్ తొలి స్పందన..
ట్రంప్ దోషిగా తేలడంపై స్టార్మీ డానియల్స్ తొలిసారి స్పందించారు. ఇంత త్వరగా తీర్పు వెలువడటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనకు జైలు శిక్ష విధించాలని కోరారు. పేదవారికి సేవ చేసే బాధ్యతను అప్పగించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ దోషిగా తేలినంత మాత్రాన తనకు ఈ కేసు ముగిసినట్లు కాదని వ్యాఖ్యానించారు. ‘‘ఆయనకు అపరాధ భావన ఉండొచ్చు. నేను మాత్రం ఆ మచ్చతోనే జీవితాన్ని గడపాలి’’ అని అన్నారు.
టిక్‌టాక్‌లోకి ట్రంప్..
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లో ట్రంప్ ఖాతా తెరిచారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెవార్క్లో జరిగిన ‘‘అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్’’ వేదిక నుంచి ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన తన అభిమానులకు అభివాదం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ కనిపించారు. శనివారం సాయంత్రం ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఆదివారం ఉదయానికల్లా ఆయన టిక్‌టాక్‌లో 1.1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆ వీడియోకు 1 మిలియన్ లైక్స్, 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లకు చేరువకావడానికి దీన్నొక అవకాశంగా భావిస్తున్నట్లు ట్రంప్ అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిక్‌టాక్‌ను నిషేధించే దిశగా ట్రంప్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్‌తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్‌తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్‌వర్క్‌పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్‌లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్‌లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్‌లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్‌పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్‌ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్‌ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్‌రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!