Donald Trump: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్‌ జోరు

Donald Trump: ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రైమరీల్లో గెలుపొందిన ట్రంప్‌ తాజాగా దక్షిణ కరోలినాలోనూ విజయం సాధించారు.

Updated : 25 Feb 2024 13:31 IST

Donald Trump | వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డోనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. సొంత రాష్ట్రంలోనూ నిక్కీ హేలీకి ఓటమి తప్పలేదు. ఇప్పటికే న్యూ హాంప్‌షైర్‌, నెవడా, ఐయోవా, వర్జిన్‌ ఐలాండ్స్‌లో ట్రంప్‌ గెలుపొందారు.

ఇప్పటికీ హేలీ (Nikki Haley) పోటీ నుంచి వైదొలగడానికి అంగీకరించడం లేదు. మార్చి 5న పలు రాష్ట్రాల్లో జరిగే ప్రైమరీల్లోనూ తాను రేసులో ఉంటానని ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌, ట్రంప్‌ మధ్య మరోసారి హోరాహోరీ పోటీ తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

రిపబ్లికన్‌ పార్టీ ఇప్పుడున్నంత ఐక్యంగా మునుపెన్నడూ లేదని ట్రంప్‌ అన్నారు. తాజా ఆధిక్యం తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. చాలా కాలం నుంచి దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టుంది. గతంలో నిక్కీ హేలీ ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. అయినప్పటికీ.. తాజా ప్రైమరీలో ఆమెకు మద్దతు కరవైంది. గవర్నర్‌గా ఆమె చాలా మంచి పనులు చేసినప్పటికీ.. జాతీయ స్థాయి వ్యవహారాలను మాత్రం ఆమె ట్రంప్‌ కంటే మెరుగ్గా నిర్వహించలేరని భావిస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని