Portugal Air Show: గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్‌ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!

Portugal Air Show: పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్‌ దుర్మరణం చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

Published : 03 Jun 2024 10:34 IST

లిస్బన్‌: దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో (Portugal Air Show) ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్‌ మృతిచెందగా.. మరో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు.

బెజాలో ఆదివారం జరుగుతున్న ఎయిర్‌షోలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు ప్రదర్శిస్తుండగా.. ఒకటి వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు ఆవల పడగా.. మరొకటి సమీపంలో కుప్పకూలింది. విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్‌ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు.

పోర్చుగల్‌, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్‌ స్టార్స్’ అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. మరణించిన పైలట్‌ స్పెయిన్‌కు చెందిన వ్యక్తి కాగా.. గాయపడిన పైలట్‌ పోర్చుగల్‌ పౌరుడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వీక్షకుడు తన కెమెరాలో బంధించి ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా అది వైరలవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు