Ukraine crisis: రష్యాకు ఇది ట్రైలరే.. అసలు కథ ముందుంది: ఉక్రెయిన్ రక్షణ మంత్రి

Ukraine Crisis: గత ఏడాది నుంచి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. దీనిలో అసలు కథ ముందుఉందని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి వెల్లడించారు. 

Published : 28 Jun 2023 19:32 IST

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా(Ukraine-Russia) పోరులో గత ఏడాది కాలంగా ఎన్నో పరిణామాలు చోటుచేసున్నాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ కాస్త ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ ( defence minister Oleksiy Reznikov ) చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

‘కీవ్‌ చేస్తోన్న ప్రణాళికబద్దమైన ఎదురుదాడిలో అసలు కథ ముందుంది. అది జరిగినప్పుడు.. దానిని మీరంతా చూస్తారు. అందరూ అంతా చూస్తారు’ అని వెల్లడించారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ ఎదురుదాడి నెమ్మదించిందన్న అనుమానాలను మీడియా వ్యక్తం చేయగా.. ఆయన వాటిని తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌ దళాలు మరింత శిక్షణ పొందాయని, ఆధునిక ట్యాంకులు, సాయుధ వాహనాలు ఇంకా ఆపరేషన్‌లో భాగం కావాల్సి ఉందని వెల్లడించారు. అలాగే ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) పెంచి పోషించిన వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేశారు. ఇది పుతిన్‌ను ఇరకాటంలో పెట్టింది. అయితే ఈ పరిణామాలను చూసి, ఉదాసీనంగా ఉండొద్దని బలగాలను రక్షణ మంత్రి హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. ఎదురుదాడిలో 300 కిలోమీటర్లను రష్యా నుంచి ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుందని యూకే రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఎదురుదాడిలో ఉక్రెయిన్‌ ఆశించిన దాని కంటే నెమ్మదిగానే ముందుకు వెళ్తుందనే విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు