Ukraine: ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభం.. బఖ్‌ముత్‌లో ముందుకు

ఉక్రెయిన్‌ భారీస్థాయిలో రష్యాపై ఎదురుదాడి ప్రారంభించింది. డొనెట్స్క్‌, బఖ్‌ముత్‌ సహా చాలా ప్రాంతాల్లో తమ దళాలు ముందుకు దూసుకుపోతున్నాయని కీవ్‌ తెలిపింది.

Published : 10 Jun 2023 23:35 IST

జపొరీజియాలో ఆఖరి రియాక్టరూ మూసివేత

కీవ్‌: ఉక్రెయిన్‌ భారీస్థాయిలో రష్యాపై ఎదురుదాడి ప్రారంభించింది. డొనెట్స్క్‌, బఖ్‌ముత్‌ సహా చాలా ప్రాంతాల్లో తమ దళాలు ముందుకు దూసుకుపోతున్నాయని కీవ్‌ తెలిపింది. ముఖ్యంగా బఖ్‌ముత్‌లో మాస్కో దళాలను వెనక్కి నెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నగరాన్ని తాము పూర్తిగా కైవసం చేసుకున్నామని గత వారం రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు శత్రువు భారీస్థాయి ఎదురుదాడి విఫలమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. కీవ్‌ దళాలను నిలువరిస్తున్నామని, అవి ముందుకు కదలడం లేదని.. అనుకున్న లక్ష్యాలను అవి సాధించలేదని తెలిపారు. మరోవైపు జపొరీజియా అణువిద్యుత్కేంద్రానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఆఖరి అణురియాక్టర్‌ కార్యకలాపాలను కూడా నిలిపివేసినట్లు ఉక్రెయిన్‌ అణు సంస్థ ఎనర్గో ఆటమ్‌ తెలిపింది. కఖోవ్కా డ్యాం పేల్చివేతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని