Cellular Outage: అమెరికా టెలికాం సేవల్లో అంతరాయం.. వేల సంఖ్యలో ఫిర్యాదులు!

అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం (Cellular Outage) ఏర్పడింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్‌ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం.

Published : 22 Feb 2024 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం (Cellular Outage) ఏర్పడింది. ఏటీ&టీ, వెరిజోన్‌, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో (Mobile Networks) కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ వెల్లడించింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.

ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 31వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. వెరిజోన్‌కు వెయ్యికి పైగా ఫిర్యాదులు రాగా.. టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. అత్యవసర సేవల కోసం (911) ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. అయితే, ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడి కావాల్సిఉంది. సైబర్‌ దాడిపై అనుమానం వ్యక్తంచేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని